మాస్ లుక్‌లో అఖిల్‌.. ఆక‌ట్టుకుంటున్న బ‌ర్త్ డే పోస్ట‌ర్‌

Akhil Akkineni’s New Poster Released On His Birthday.అక్కినేని వార‌సుడు అక్కినేని అఖిల్ న‌టిస్తున్న చిత్రం ఏజెంట్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2022 12:56 PM IST
మాస్ లుక్‌లో అఖిల్‌.. ఆక‌ట్టుకుంటున్న బ‌ర్త్ డే పోస్ట‌ర్‌

అక్కినేని వార‌సుడు అక్కినేని అఖిల్ న‌టిస్తున్న చిత్రం 'ఏజెంట్‌'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ - సురేందర్ రెడ్డి 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా అఖిల్ స‌ర‌స‌న సాక్షి వైద్య న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. నేడు అఖిల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ఈ పోస్ట‌ర్‌లో పోస్ట‌ర్‌లో అఖిల్ సిగ‌రెట్ తాగుతూ మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

సిక్స్ ప్యాక్ బాడీతో అఖిల్ స్ట‌న్నింగ్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. ఈ ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈచిత్రానికి హిప్ హాప్ త‌మీజ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ 'రా ఏజెంట్‌'గా క‌నిపించనున్నాడు. ఆగ‌స్టు 12న ఈ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం.

ఇక ఈ చిత్రంపై అఖిల్ ఎన్నో ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నాడు అఖిల్‌. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' కాస్త ఊర‌ట‌నిచ్చింది. ఏజెంట్ చిత్రంతో తానెంటో నిరూపించుకోవాల‌ని అనుకుంటున్నాడు అఖిల్.

Next Story