సంచలనం సృష్టిస్తున్న బాలయ్య 'అఖండ' టీజర్

Akhanda Teaser Creates Records. సెకండ్ టీజర్ రిలీజై మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతూ 'అఖండ' సంచలనాన్ని సృష్టిస్తోంది.

By Medi Samrat  Published on  25 April 2021 5:07 PM IST
Akhanda

ఇటీవలే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ' సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే..! బాలయ్య బాబును అఘోరాగా చూపించడంలో బోయపాటి శ్రీను సక్సెస్ అయ్యాడని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతక ముందు వచ్చిన 'సింహ', 'లెజెండ్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించి పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇక చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ బాలయ్య - బోయపాటి కాంబినేషన్ రిపీటవుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా టీజర్ రావడం.. ఊర మాస్ కు కేరాఫ్ గా మారడంతో యూట్యూబ్ లో వ్యూస్ భారీగా వస్తున్నాయి.

అగోరా పాత్రతో కూడుకున్న సెకండ్ టీజర్ రిలీజై మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతూ 'అఖండ' సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'అఖండ' టీజర్ 40 ప్లస్ మిలియన్స్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సౌత్ లోని సీనియర్ హీరోలలో ఏ హీరో సినిమా టీజర్ కు కూడా దక్కని వ్యూస్ అఖండకు వచ్చాయి. టీజ‌ర్‌లో తమన్ సంగీతం సూపర్..! బాలయ్య బాబు గెటప్ సినిమాకు ప్లస్ కాబోతోందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. సినిమాలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ న‌టిస్తోంది.


Next Story