గొప్ప మనసును చాటుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌

Ajith Kumar helps woman travelling with a toddler at airport. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్ తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు.

By M.S.R
Published on : 15 April 2023 1:42 PM IST

గొప్ప మనసును చాటుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌

Ajith Kumar helps woman travelling with a toddler at airport


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్ తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు. పది నెలల బిడ్డ, బ్యాగ్‌ మోయలేక ఇబ్బంది పడుతున్న ఆ అభిమానికి ఆయన సహాయం అందించారు. ఆమె బ్యాగ్‌ను స్వయంగా విమానం దాకా మోసుకుంటూ వెళ్లారు. ఈ ఘటన లండన్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.


ఈ విషయాన్ని సదరు మహిళ భర్త సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ‘నా భార్య పది నెలల బాబుతో ఒంటరిగా గ్లాస్గో నుంచి చెన్నై ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో లండన్‌ విమానాశ్రయంలో ఆమె హీరో అజిత్‌ను కలిసే ఛాన్స్‌ వచ్చింది. ఆ సమయంలో నా భార్య బాబుతో పాటు రెండు చేతుల్లో ట్రావెల్‌ సూట్‌ కేస్‌, బేబి బ్యాగ్‌ ఉన్నాయి. నా భార్య ఇబ్బందిని గమనించిన అజిత్‌.. సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.' అని చెప్పుకొచ్చారు. నా భార్య చేతిలోని బేబీ బ్యాగును తీసుకున్నారు. వద్దన్నా వినలేదని చెప్పుకొచ్చారు. నాకూ ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఆ ఇబ్బందులు ఏంటో నాకూ తెలుసని అజిత్‌ అన్నారు. బేబీ బ్యాగ్‌ను విమానం వచ్చే వరకు మోశారు. ఆ సమయంలో ఆయన చేతుల్లో ఓ సూట్‌ కేసు కూడా ఉంది. అంత పెద్ద స్టార్‌ అయి ఉండి కూడా ఆయన ఎంతో సింపుల్ గా వ్యవహరించడం నన్నెంతో ఆకట్టుకుంది. ఆయన ఎంతో గొప్ప మనిషి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది.


Next Story