ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్

అజయ్ దేవగన్-మాధవన్ నటించిన సైతాన్ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ ను సాధించింది.

By Medi Samrat
Published on : 4 May 2024 12:45 PM IST

ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్

అజయ్ దేవగన్-మాధవన్ నటించిన సైతాన్ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ ను సాధించింది. మంచి మౌత్ టాక్‌తో సైతాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. దేశీయంగా దాదాపు 150 కోట్ల నికర వసూళ్లు సాధించింది ఈ సినిమా. అజయ్ దేవగన్ స్టార్ పవర్, మంచి కంటెంట్ ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించడంలో సహాయపడింది.

ఈ హారర్ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్‌లతో పాటు హిందీ ఆడియోలో అందుబాటులోకి ఉంది. థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయిన వారందరికీ ఇది గొప్ప అవకాశం. తమ కుమార్తెకు సైతాన్ నుండి విముక్తి కల్పించేందుకు ఆమె తల్లిదండ్రులు చేసే పోరాటమే ఈ సినిమా. అజయ్ దేవగన్, జ్యోతిక భార్యాభర్తలుగా నటించగా, జాంకీ బోడివాలా వారి కుమార్తెగా నటించారు. మూడు దశాబ్దాల తర్వాత జ్యోతిక ఓ హిందీ సినిమాలో నటించింది. మాధవన్ ప్రతినాయకుడిగా నటించారు. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అజయ్ దేవగన్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్, జ్యోతి దేశ్ పాండే కలిసి నిర్మించారు.

Next Story