ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఐశ్వర్య, అభిషేక్ డ్యాన్స్..'కజ్రా రే' సాంగ్‌కు కూతురితో కలిసి స్టెప్పులు

పూణెలో జరిగిన ఓ వివాహ వేడుకలో దంపతులు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ 'కజ్రా రే' పాటకు స్టెప్పులేశారు.

By Knakam Karthik
Published on : 2 April 2025 3:57 PM IST

Cinema News, Bollywood, Aishwaryarai, Abhishek Bachchan, Kajra re Song

ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఐశ్వర్య, అభిషేక్ డ్యాన్స్..'కజ్రా రే' సాంగ్‌కు కూతురితో కలిసి స్టెప్పులు

పూణెలో జరిగిన ఓ వివాహ వేడుకలో దంపతులు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ 'కజ్రా రే' పాటకు స్టెప్పులేశారు. ఐశ్వర్య కజిన్ వివాహానికి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. ఆ వీడియోలో ఐశ్వర్య పసుపు రంగు సూట్‌లో అందంగా కనిపించగా, అభిషేక్ గులాబీ రంగు కుర్తా, తెల్లటి పైజామాలో మెరిశారు. మరోవైపు ఆరాధ్య తెల్లటి లెహంగా ధరించింది. అయితే వివాహం అనంతరం ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో స్టార్ కపుల్స్ మరోసారి బాలీవుడ్ హిట్ సాంగ్ 'కజ్రా రే'కు డ్యాన్స్ చేశారు. అయితే ఈ పాటకు ఆరాధ్య కూడా స్టెప్పులేయడంతో అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కేరింతలు కొట్టారు.

కాగా 2005లో రిలీజ్ అయిన బంటీ ఔర్ బబ్లీ మూవీలో కజ్రా రే సాంగ్‌ను అభిషేక్, ఐశ్వర్, అమితాబ్ బచ్చన్‌లపై చిత్రీకరించారు. ఇప్పుడు అదే జంట మళ్లీ ఆ పాటకు డ్యాన్స్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story