వరంగల్ లో అఖిల్ 'ఏజెంట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథి ఎవ‌రంటే..

Agent Movie Pre Release Event In Warangal. అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజవుతోంది.

By Sumanth Varma k  Published on  23 April 2023 8:45 PM IST
వరంగల్ లో అఖిల్ ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథి ఎవ‌రంటే..

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజవుతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు అగ్రెసివ్ ప్రమోషన్స్ జరుపుకుంటుంది. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేశారు. వరంగల్ లో జరిగే ఈ భారీ వేడుకకు ముఖ్య అతిధిగా అక్కినేని నాగార్జున హాజరు కాబోతున్నాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగార్జున వస్తే.. సినిమా పై ఉన్న అంచనాలు రెట్టింపు అవుతాయి. మరి ఈ ఈవెంట్ లో నాగార్జున ఏం మాట్లాడతారో చూడాలి. అక్కినేని అఖిల్ సరసన ఈ సినిమాలో సాక్షి వైద్య జంటగా నటించింది.

అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో మొదటి సారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. పైగా మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. అన్నిటికి మించి ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గతంలో పోకిరి, బాహుబలి 2 సినిమాలు కూడా ఇదే డేట్ లో రిలీజై భారీ హిట్స్ కొట్టాయి. మరి ఏజెంట్ కూడా ఆ రేంజ్ హిట్ కొడుతుందేమో చూడాలి.




Next Story