వీల్ చైర్ పై కపిల్ శర్మ.. షాక్ తిన్న నెటిజన్లు!

After Pics Of Wheelchair-Bound Kapil Sharma Go Viral. బాలీవుడ్ క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ ముంబై ఎయిర్ పోర్ట్‌లో వీల్ చైర్‌లో కూర్చొని క‌నిపించి షాక్ ఇచ్చాడు

By Medi Samrat  Published on  23 Feb 2021 12:46 PM IST
After Pics Of Wheelchair-Bound Kapil Sharma Go Viral.

బాలీవుడ్ లో ఎంతో మంది బుల్లితెరపై కమెడియన్స్ తమ ఎంట్రటైన్ మెంట్ తో మెప్పించారు. నటుడు, టివి వ్యాఖ్యాత, నిర్మాత భారతీయ స్టాండప్ కమెడీయన్ కపిల్ శర్మ. జూన్ 2013 నుంచి జనవరి 2016 వరకు భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆయన. 2013లో ఫోర్బ్స్ సంస్థ భారతీయ సెలబ్రటీ జాబితాలో 93వ వ్యక్తిగా పేర్కొంది. భారత ప్రధాని నరేంద్రమోడి కపిల్ ను స్వచ్ఛ భారత్ అభియాన్ కు ఎంపిక చేశారు. ఎంహెచ్ వన్ లో హస్దే హసాందే రహో షోలో కనిపించారు కపిల్.

ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్ కామెడీ షోతో మొట్టమొదటి విజయం సాధించారు ఆయన. ఆ తరువాత 9 రియాలిటీ షోల్లో విజేతగా నిలిచారు కపిల్. 2007లో ఒక షోలో 10లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. గతంలో పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు కపిల్ శర్మ. తాజాగా బాలీవుడ్ క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ ముంబై ఎయిర్ పోర్ట్‌లో వీల్ చైర్‌లో కూర్చొని క‌నిపించి షాక్ ఇచ్చాడు. వీల్ చైర్‌లో కూర్చున్న అత‌నిని వేరొక వ్య‌క్తి తీసుకెళుతుండ‌గా ఫొటోగ్రాఫ‌ర్స్ క్లిక్‌మనిపించారు.

2018లో హిందూ, సిక్కు సంప్రదాయంలో గిన్ని చరాత్‌ను వివాహం చేసుకున్న క‌పిల్ శ‌ర్మ 2019 డిసెంబర్‌లో కూతురు అనైరా శర్మకు జ‌న్మ‌నిచ్చారు, ఫిబ్ర‌వ‌రి 1,2021న త‌మ‌కు పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించారని తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం అత‌ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే క‌పిల్ శ‌ర్మ‌కు ఏమైంద‌నే విష‌యంపై క్లారిటీ లేదు.


Next Story