Adipurush: ప్రతి థియేటర్‌లో 'హనుమంతుడి' కోసం సీటు రిజర్వ్

ప్రభాస్ రాబోయే చిత్రం 'ఆదిపురుష్‌' విడుదలకు దగ్గర్లో ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నందున, అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి

By అంజి  Published on  6 Jun 2023 6:45 PM IST
Adipurush, Lord Hanuman, Tollywood, Prabhas

Adipurush: ప్రతి థియేటర్‌లో 'హనుమంతుడి' కోసం సీటు రిజర్వ్ 

ప్రభాస్ రాబోయే చిత్రం 'ఆదిపురుష్‌' విడుదలకు దగ్గర్లో ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నందున, అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ప్రమోషన్ చివరి దశ ప్రారంభం కావడంతో మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ.. ఈ చిత్రాన్ని ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటు హనుమంతుడికి అంకితం చేయబడుతుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ జూన్ 16న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ అనే ఐదు భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో స్క్రీనింగ్ అనుభవం గురించి చిత్ర నిర్మాతలు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేస్తున్నారు. రామాయణంలోని ఆధ్యాత్మిక సారాంశానికి అనుగుణంగా, ఆదిపురుష్‌లో శ్రీరాముని పాత్రను ప్రభాస్ ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటు అమ్మబడకుండా వదిలివేయబడుతుంది. హనుమంతునికి మాత్రమే కేటాయించబడుతుంది.

'ఆదిపురుష్‌' టీమ్‌ అధికారిక ప్రకటన ప్రకారం.. ''రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ.. ప్రభాస్‌ రాముడిగా నటించిన 'ఆదిపురుష్‌' సినిమాని ప్రదర్శించే ప్రతీ థియేటర్‌లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించబడుతుంది. అతిగొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ.. చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన 'ఆదిపురుష్‌'ని హనుమంతుడి సమక్షంలో తప్పక వీక్షిద్దాం''

Next Story