ఆదిపురుష్ టికెట్లు ఎప్పటి నుండి దొరుకుతాయంటే?

Adipurush Movie Tickets Advance Booking. ప్రస్తుతం సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. జూన్ 16న ఈ సినిమా తెలుగుతోపాటు.

By Medi Samrat  Published on  10 Jun 2023 8:30 AM IST
ఆదిపురుష్ టికెట్లు ఎప్పటి నుండి దొరుకుతాయంటే?

ప్రస్తుతం సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. జూన్ 16న ఈ సినిమా తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతుంది. డైరెక్టర్ ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. వెండితెరపై తొలిసారి రాముడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏ను చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం నుంచి ఓపెన్ కానున్నాయని చిత్రయూనిట్ వెల్లడించింది. దీంతో ఆదివారం నుండి ఆదిపురుష్ సినిమాకు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వనుంది. వీలైనంత త్వరగా సినిమా చూసేయాలని అనుకునే వాళ్లు సినిమా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ ఆదివారంతో వాళ్ల వెయిటింగ్ ముగిసినట్లే.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ సర్టిఫికేట్ ను జారీ చేసింది. 2గంటల 59 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ రన్ టైమ్ తో ఏ సినిమా రాలేదు. మూడు గంటల రన్ టైమ్ తో రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ లో ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది.


Next Story