ఆదిపురుష్ నుంచి మరో అప్‌డేట్

Adipurush Movie latest update.రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ నుంచి మరో అప్‌డేట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2021 4:35 AM GMT
Adipurush Movie latest update

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ సినిమా ఒకటి. పౌరాణిక గాథ రామాయ‌ణంను ఆధారంగా ఓం రావ‌త్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీ వ‌ర్క్‌ను ఈ రోజు నుండి చిత్ర యూనిట్ ప్రారంభించింది. ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఈ రోజు మోష‌న్ క్యాప్చ‌ర్ మొద‌లైంది. ఫిబ్ర‌వరి 2న ముహూర్తం అని చెప్పాడు. ఈ టెక్నాల‌జీని ఇంట‌ర్నేష‌న‌ల్ చిత్రాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్ గా న‌టిస్తున్నాడు. ఇక సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోందని సమాచారం. ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారు అన్న‌దానిని ఇంకా చిత్ర బృందం వెల్ల‌డించ‌లేదు.


టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృషన్‌ కుమార్‌లతో పాటు ఓంరావుత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రావుత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవ‌లే ప్ర‌భాస్ రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తిచేశాడు. గ‌త రెండు రోజుల నుంచి స‌లార్ రెగ్యుల‌ర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.


Next Story