భీమ్లానాయ‌క్‌.. ఆక‌ట్టుకుంటున్న 'అడ‌వి త‌ల్లి మాట' సాంగ్‌

Adavi Thalli Maata song release from Bheemla Nayak.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుపాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2021 10:35 AM IST
భీమ్లానాయ‌క్‌.. ఆక‌ట్టుకుంటున్న అడ‌వి త‌ల్లి మాట సాంగ్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'భీమ్లా నాయ‌క్'. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రానా ద‌గ్గుపాటి ఓ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నాడు. . సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈచిత్రాన్ని నిర్మింస్తుండ‌గా.. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు భార్య‌గా నిత్యామీన‌న్ క‌నిపించ‌నుండ‌గా.. రానాకు జోడిగా సంయుక్త మీన‌న్ న‌టిస్తోంది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి మూడు పాట‌ల‌ను విడుద‌ల చేయగా.. తాజాగా నేడు(శ‌నివారం) నాలుగో పాట‌ను విడుద‌ల చేశారు. 'అడ‌వి త‌ల్లి' అంటూ ఈ పాట సాగుతోంది. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Next Story