బాలీవుడ్‌ పీఆర్‌ ఏజెన్సీలపై.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

'రామాయణ' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు నటి సాయిపల్లవి. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ పీఆర్‌ ఏజెన్సీలపై నటి సాయి పల్లవి ఇటీవల 'అమరన్‌' ప్రమోషన్స్‌ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

By అంజి  Published on  25 Oct 2024 11:50 AM IST
Actress Sai Pallavi, Bollywood, PR agencies, viral

బాలీవుడ్‌ పీఆర్‌ ఏజెన్సీలపై.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

'రామాయణ' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు నటి సాయిపల్లవి. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ పీఆర్‌ ఏజెన్సీలపై నటి సాయి పల్లవి ఇటీవల 'అమరన్‌' ప్రమోషన్స్‌ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కొంతకాలం క్రితం బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఫోన్‌ చేశాడని, తనను ప్రమోట్‌ చేసుకోవడానికి, తరచూ వార్తల్లో ఉండటం కోసం పీఆర్‌ ఏజెన్సీ కావాలా? అని అడిగాడని సాయిపల్లవి చెప్పింది. అలా చేయడం వల్ల తనకు ఎలాంటి ఉపయోగం లేదని తెలిపింది.

తరచూ తన గురించి మాట్లాడుతుంటే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయిపల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలు తరచూ వార్తల్లో ఉండటానికి కారణం పీఆర్‌ టీమ్‌లేనని పలువురు భావిస్తున్నారు.

నితేశ్‌ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణ' ప్రాజెక్టులో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సీత పాత్రలో సాయిపల్లవి, రావణుడి పాత్రలో యశ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్‌ దశలో ఉంది. శివ కార్తికేయన్‌, సాయిపల్లవి జంటల నటించిన సినిమా 'అమరన్‌'. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Next Story