ప్రముఖ సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న చెన్నైలోని తన నివాసంలో తుదిశ్శాస విడిచారు. ఎంజీఆర్, శివాజీ వంటి తమిళ సినిమా అగ్ర తారలతో కలిసి పుష్పలత పనిచేశారు. ఆమె 1961లో విడుదలైన 'సెంగోట్టై సింగం' చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టారు. తమిళ సినిమాలో 100 కి పైగా చిత్రాలలో కథానాయికగా, సహాయ పాత్రలలో నటించారు. ఆమె నటుడు AVM రాజన్ భార్య.
పుష్పలత తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి ఇతర భాషా చిత్రాలలో కూడా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుగులో చెడపకురా చెడేవు, ఆడబిడ్డ, రాము, యుగపురుషుడు, వేటగాడు తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. పుష్పలత మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఈమె కూతురు మహాలక్ష్మీ హీరోయిన్‌గా రెండు జెళ్ల సీత, ఆనందభైరవి చిత్రాల్లో నటించారు.