'ఏదైనా ఉంటే నేనే చెప్తా'.. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి రియాక్షన్ ఇదే
టాలీవుడ్‌లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతోందని పలు న్యూస్ వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి.
By అంజి Published on 30 Oct 2023 12:48 PM IST'ఏదైనా ఉంటే నేనే చెప్తా'.. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి రియాక్షన్ ఇదే
టాలీవుడ్‌లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతోందని పలు న్యూస్ వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. ఓ సినీ నిర్మాతను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని ఆమెపై వార్తలు రాశారరు. ఈ నేపథ్యంలోనే ఆ వార్తలపై నటి స్పందించారు. పెళ్లి వార్తలపై నటి ప్రగతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం ఆధారాలు ఉన్నాయని ఈ వార్త రాశారు? అంటూ ప్రగతి చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పెద్ద పెద్ద పత్రికలు ఇలాంటి వార్తలు రాయడం ఏంటని ప్రశ్నించారు. తన రెండో పెళ్లి వార్తలను నటి ప్రగతి ఖండించారు. అది ఏమాత్రం నిజం కాదని స్పష్టం చేశారు. తాను కేవలం ఒక నటి అన్న కారణంతోనే ఏది పడితే అది రాస్తారా? అంటూ మీడియాపై మండిపడ్డారు.
తన రెండో పెళ్లి పుకార్లపై క్లారిటీ ఇస్తూ ప్రగతి ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఈ పుకార్లను వైరల్ చేసిన వారిపై, సృష్టించిన వారిపై ఆమె విరుచుకుపడ్డారు. ''మీకు కనీస బాధ్యత లేకపోతే ఎలా? జర్నలిజం విలువలు అంటూ ఉంటాయి కదా.. అవి లేకపోతే ఎలా? ఈ వార్త చూసి నాకు చాలా బాధ కలిగింది. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇలాంటి వార్తలు రాయండి.. లేదంటే రాయొద్దు. ఇలాంటి తప్పులు రిపీట్ చేయొద్దు. కాస్త బాధ్యతగా వ్యవహరించండి'' అంటూ ప్రగతి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఒకరి పర్సనల్ లైఫ్‌లో జోక్యం చేసుకొని, ఏది పడితే అది రాయడానికి మీకు ఏం హక్కు ఉందని ప్రగతి ప్రశ్నించారు. ఎదైనా ఉంటే తాను చెబుతానని అన్నారు.
ఒకరి గురించి రాసేటప్పుడు హద్దులు మీరకూడదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. ఎవడో కలగన్నాడా.. మీదాంట్లో ఎవరైనా కలగని రాశారా అంటూ ప్రగతి తీవ్రంగా మండిపడింది. తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన 47 ఏళ్ల ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా కొన్ని వెబ్‌సైట్లు వార్తలు రాశాయి. ప్రస్తుతం ప్రగతి.. డబుల్ ఇస్మార్ట్ తోపాటు పలు ఇతర సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో ప్రగతి అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పోస్ట్‌లు పెడుతుంటారు.