నిన్ను కలిశాక, రంగం సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి పియా బాజ్ పాయ్ ఇంట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు కరోనా కారణంగా మరణించాడు. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. ఆమె సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కావాలని కోరుతూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టింది.

పియా బాజ్ పాయ్ తన సోదరుడు చనిపోయినట్లుగా మంగళవారం ట్వీట్ చేసింది. అంతకు ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తన సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కావాలని కోరింది. ఫరూఖాబాద్ లో వెంటిలేటర్ ఉన్న బెడ్ కావాలని.. ఎవరైనా తెలిస్తే సహాయం చేయండి.. నా సోదరుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఉన్నాడని ఆమె తెలిపింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఆమె ఈ పోస్టు చేయగా.. రెండు గంటల తర్వాత తన సోదరుడు మరణించాడని ఆమె చెప్పుకొచ్చింది.

భారతదేశంలో గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,20,289 మంది కోలుకోగా... 3,449 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 2,22,408కి పెరిగింది. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. ఇప్పటివరకు భారత్ లో 2,02,82,833 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,66,13,292 మంది కరోనా నుంచి విముక్తులవగా, ఇంకా 34,47,133 మందికి చికిత్స జరుగుతోంది. చాలా ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.


సామ్రాట్

Next Story