41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్ నమిత
Actress Namitha announces pregnancy on 41st birthday sharing cute baby bump pics.ఇటీవల స్టార్ హీరోయిన్ కాజల్ పండంటి
By తోట వంశీ కుమార్ Published on 10 May 2022 1:04 PM ISTఇటీవల స్టార్ హీరోయిన్ కాజల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ తాను తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించింది. తన పుట్టిన రోజు నాడు బేబి బంప్ ఫోటోతో ఈ విషయాన్ని సదరు హీరోయిన్ వెల్లడించింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సొంతం చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నమిత. ఆ తరువాత విక్టరీ వెంకటేష్‌తో 'జెమిని', రవితేజతో 'ఒకరాజు-ఒకరాణి', ప్రభాస్‌తో 'బిల్లా', బాలయ్యతో 'సింహా' వంటి చిత్రాల్లో నటించింది. అయితే.. తెలుగులో కంటే ఆమె తమిళంలోనే ఎక్కువ గుర్తింపు లభించింది. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఓ దశలో ఆమెపై ఉన్న అభిమానంతో అభిమానులు నమితకు ఏకంగా గుడి కట్టేశారు.
కాగా.. 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యాపార వేత్తను నమిత పెళ్లి చేసుకుంది. కాగా.. ఈ రోజు(మే 10) నమిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ.. 'మాతృత్వం… నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కిక్స్ కొత్త అనుభూతి ఇస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్' అంటూ నమిత రాసుకొచ్చింది. కాగా.. 41 ఏళ్ల వయస్సులో నమిత తల్లి కావడం గమనార్హం.