ల‌వర్‌తో క‌లిసి మాజీ ప్రియుడిని భ‌వ‌నంపై నుంచి తోసేసిన బుల్లితెర న‌టి.. అరెస్ట్‌

Actress Nagavadhini arrested by Banjarahills police.ల‌వ‌ర్‌తో క‌లిసి మాజీ ప్రియుడిని రెండో అంత‌స్తు నుంచి కింద‌కు తోసి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2022 10:20 AM IST
ల‌వర్‌తో క‌లిసి మాజీ ప్రియుడిని భ‌వ‌నంపై నుంచి తోసేసిన బుల్లితెర న‌టి.. అరెస్ట్‌

ఓ బుల్లితెర న‌టి.. త‌న ప్రేమ‌కు అడ్డు వ‌స్తున్నాడ‌ని ల‌వ‌ర్‌తో క‌లిసి మాజీ ప్రియుడిని రెండో అంత‌స్తు నుంచి కింద‌కు తోసి హ‌త్య‌యత్నానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 'గుప్పెడంత మనసు', 'గుండమ్మ కథ' సీరియల్స్ లో నటిస్తున్న నాగవర్థిని(34) సూర్యనారాయణ(30) లు ప్రేమించుకున్నారు. కృష్ణానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగేళ్లు సహజీవనం చేశారు. అయితే.. ఇటీవ‌ల అత‌డికి దూర‌మైన నాగ‌వ‌ర్థిని నాలుగు నెల‌లుగా శ్రీనివాస్‌రెడ్డి అనే మ‌రో వ్య‌క్తితో అదే ప్లాట్‌లో స‌హ‌జీవ‌నం చేస్తోంది. కాగా.. సూర్య నారాయ‌ణ అదే భ‌వ‌నంలోని నాలుగో అంత‌స్తులో ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య త‌ర‌చుగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.

మాజీ ప్రియుడు తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని, అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం ఆమె తీసుకుంది. ప్లాన్ ప్రకారం.. సూర్యనారాయణను అక్టోబ‌ర్ 30న రాత్రి ఇద్దరు కలిసి రెండో ఫ్లోర్ నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నాగ‌వ‌ర్ధిని, శ్రీనివాస్ రెడ్డిల‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసి బుధ‌వారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Next Story