Video: ఈడీ విచారణకు హాజరైన మంచులక్ష్మీ

బెట్టింగ్‌ యాప్‌ ప్రచారం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ నటి, సినీ నిర్మాత మంచు లక్ష్మీ విచారణకు హాజరయ్యారు.

By అంజి
Published on : 13 Aug 2025 11:14 AM IST

Actress Manchu Lakshmi, Enforcement Directorate, Bettingapp

Video: ఈడీ విచారణకు హాజరైన మంచులక్ష్మీ

బెట్టింగ్‌ యాప్‌ ప్రచారం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ నటి, సినీ నిర్మాత మంచు లక్ష్మీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్ల వీడియోలో ఎందుకు పాల్గొన్నారు? ఇందులో ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి? వంటి విషయాలపై అధికారులు ఆమె నుంచి వివరాలను రాబట్టనున్నారు.

ఇటీవల బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈడీ, బషీర్‌బాగ్‌లోని ఈడీ జోనల్ కార్యాలయంలో దర్యాప్తు బృందం ముందు హాజరు కావాలని నోటీసులు పంపింది. ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు విజయ్‌ దేవరకొండ, ప్రకాష్‌రాజ్‌, రానాను ఈడీ ముందు హాజరయ్యారు. వారిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.

గతంలో బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన ప్రకటనలో నటించి, బెట్టింగ్‌ను ప్రోత్సహించినందుకు సైబరాబాద్ పోలీసులు మంచు లక్ష్మీతో పాటు ఇతర ప్రముఖ నటులపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ విషయంపై ఈడీ సమాంతర దర్యాప్తు ప్రారంభించింది.

సినీ ప్రముఖులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఆకర్షితులయ్యారని, దీనివల్ల వారు భారీ ఆర్థిక నష్టాలను చవిచూశారని, కొందరు తమ జీవితాలను కూడా ముగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఈడీ ఇప్పటివరకు 36 మంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి ఇప్పటికే ఈడీ అధికారుల ముందు హాజరై వారి వాంగ్మూలాలను నమోదు చేశారు.

Next Story