యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్‌రెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి దాడి

Actress Karate Kalyani attack Youtuber SrikanthReddy.ప్రాంక్ పేరుతో మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2022 9:28 AM IST
యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్‌రెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి దాడి

ప్రాంక్ పేరుతో మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని ఆరోపిస్తూ యూట్యూబ్ ప్రాంక్‌స్ట‌ర్ శ్రీకాంత్ రెడ్డి పై సినీ న‌టి క‌రాటే క‌ల్యాణి దాడి చేసింది. హైద‌రాబాద్ ఎస్ఆర్‌న‌గ‌ర్ పరిధిలోని ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. శ్రీకాంత్‌రెడ్డి ఎక్కువ‌గా ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. అత‌డు చేసే ప్రాంక్ వీడియోల‌కు మంచి ఆద‌ర‌ణ‌నే ఉంటోంది. ఇదిలా ఉంటే.. నిన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి న‌టి క‌రాటే క‌ల్యాణి వెళ్లింది. ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెరిగి ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. ఈ క్ర‌మంలో మ‌ధురాన‌గ‌ర్‌లో రోడ్డుపై శ్రీకాంత్‌రెడ్డిని క‌రాటే క‌ల్యాణి చిత‌క‌బాదింది. త‌న‌పై కూడా శ్రీకాంత్ రెడ్డి దాడి చేసిన‌ట్లు ఆమె తెలిపింది. ఇరువురు ఒక‌రిపై మ‌రొక‌రు ఎస్ఆర్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Next Story