ఆస్పత్రిలో నటి కల్పికా గణేశ్.. ఫోటో వైరల్
Actress Kalpika Ganesh hospitalised.కల్పికా గణేశ్.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 29 Nov 2022 4:13 AM GMTకల్పికా గణేశ్.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'జులాయి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'పడిపడి లేచే మనసు' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సమంత ప్రధాన పాత్ర పోషించిన 'యశోద'లోనూ ఓ కీలక పాత్రలో నటించింది. నటి సమంత లాగే తాను కూడా పదమూడేళ్లుగా వయోసైటిస్‌తో పోరాడుతున్నాన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్య్వూలో బయటపెట్టింది.
ఈ సంగతి కాస్త పక్కన బెడితే.. ఆస్పత్రి బెడ్‌పై కల్పిత ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కల్పికా గణేశ్ కు ఏమైందోనని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
విషయానికి వస్తే.. కలికా గణేశ్ గత కొద్దిరోజులుగా రాడిక్యులర్ పెయిన్‌తో బాధపడుతున్నారు. రాడిక్యులర్ పెయిన్ అంటే వెన్నముక ద్వారా నొప్పి తొడలు నుంచి పాదాల వరకు ప్రయాణిస్తుంది. దీని వల్ల ఎక్కువ సేపు కూర్చోలేక, నిలబడలేకపోతుండడంతో పాటు బలహీనంగా మారుతారు. ఆస్పత్రిలో చేరిన కల్పికా శస్త్రచికిత్సను చేయించుకున్నారు. లుంబార్ రాడిక్యులోపతి విజయవంతమైందని చెబుతూ, ఆస్పత్రిలో తాను ఉన్న ఫోటోలను కల్పికా సోషల్ మీడియాలో షేర్ చేశారు.