హాస్యనటి గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో కుమారుడు మృతి

Actress Geetha Singh son Died in Road Accident.టాలీవుడ్ న‌టి గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2023 8:20 AM IST
హాస్యనటి గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో కుమారుడు మృతి

టాలీవుడ్ న‌టి గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆమె ద‌త్త‌త తీసుకున్న కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందాడు. ఈ విష‌యాన్ని మ‌రో న‌టి క‌రాటే క‌ళ్యాణి సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది". ద‌య చేసి కారులో అయినా బైక్‌లో అయినా జాగ్ర‌త్త‌గా వెళ్ళండి పిల్ల‌లు. క‌మెడియ‌న్ గీతాసింగ్ అబ్బాయి యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఓం శాంతి" అంటూ క‌రాటే క‌ళ్యాణి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

వాస్త‌వానికి గీతాసింగ్ పెళ్లి చేసుకోలేదు. ఆమె త‌న సోద‌రుడి కుమారుల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. వారిలో పెద్ద‌వాడు ప్ర‌మాదంలో చ‌నిపోయాడు. ప్ర‌మాదం ఎలా జ‌రిగింది అనేది పూర్తిగా తెలియ‌క‌పోయినా క‌ర్ణాట‌క రాష్ట్రంలో యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. విష‌యం తెలిసిన గీతాసింగ్ అభిమానులు, నెటీజ‌న్లు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

"ఎవ‌డిగోల వాడిది" చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగా న‌వ్వించిన గీతాసింగ్ నార్త్ ఇండియా నుంచి వ‌చ్చి ఇక్క‌డ స్థిర‌ప‌డ్డారు. "కితకిత‌లు" చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌రువాత ఎన్నో చిత్రాల్లో హ‌స్య న‌టిగా న‌టించారు. అయితే.. గ‌త కొంత‌కాలంగా ఆమెకు అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

Next Story