ప్రభాస్ లుక్ పై నటి కస్తూరి విమర్శలు

Actress Criticizes Prabhas’s Lord Ram Look. ప్రభాస్, కృతి సనన్ జంటగా 'ఆదిపురుష్' చిత్రం వస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

By Medi Samrat  Published on  9 Jun 2023 7:30 PM IST
ప్రభాస్ లుక్ పై నటి కస్తూరి విమర్శలు

ప్రభాస్, కృతి సనన్ జంటగా 'ఆదిపురుష్' చిత్రం వస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రాముడి పాత్రను పోషించిన ప్రభాస్ లుక్ పై సినీ నటి కస్తూరి విమర్శలు చేశారు. ప్రభాస్ లుక్ చూస్తుంటే ఆయన రాముడిలా లేరని, కర్ణుడిలా ఉన్నారని అన్నారు. రాముడిని, లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగు సినిమాల్లో ఎంతో మంది నటులు రాముడి పాత్రల్లో తెరపై ఎంతో అందంగా కనిపించారని, కానీ ప్రభాస్ మాత్రం కర్ణుడిలా కనిపిస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

తిరుమల కొండపై ఇటీవల ‘ఆదిపురుష్’ డైరెక్టర్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కృతి సనన్‌ని దర్శకుడు ఓంరౌత్ కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఆలింగనం తర్వాత కూడా ఓంరౌత్ హీరోయిన్ కృతి సనన్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఓంరౌత్ చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ ఘటనపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు డిమాండ్‌ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ పిఎస్‌లో డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌పై సనాతధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఫిర్యాదు చేశారు. తిరుమలలో అసభ్యంగా ప్రవర్తించిన వారిద్దరిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story