కేబీఆర్‌ పార్క్‌ వద్ద నటిపై దాడి.. పెనుగులాటలో చౌరాసియాకు

Actress chaurasia assaulted at kbr park. హైదరాబాద్‌లో ఓ సినీ నటిపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. నగరంలోని బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ రోడ్‌ నంబర్‌ 9 వద్ద ఈ ఘటన జరిగింది.

By అంజి  Published on  15 Nov 2021 1:44 AM GMT
కేబీఆర్‌ పార్క్‌ వద్ద నటిపై దాడి.. పెనుగులాటలో చౌరాసియాకు

హైదరాబాద్‌లో ఓ సినీ నటిపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. నగరంలోని బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ రోడ్‌ నంబర్‌ 9 వద్ద నటి ఒంటరిగా వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి నటి చౌరాసియాపై దాడి చేశాడు. దుండగుడు ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. దుండగుడిని వదిలించుకునేందుకు చౌరాసియా ఎదురు తిరిగింది. ఈ క్రమంలోనే దుండుగుడు ఆమెను పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆమెకు తలకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. వెంటనే ఆమె డయల్‌ 100కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బండరాయితో తనపై దాడి చేసేందుకు యత్నించాడని నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయాలపాలైన నటి చౌరాసియాను దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిన్న రాత్రం 8.30 గంటల సమయంలో నటి వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నటిపై దుండుగుడు హత్యాయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నగదు, నగలు ఇవ్వాలని నటిని దుండగుడు బెదిరించాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Next Story
Share it