30 ఏళ్ళ వయసుకు ముందే పెళ్లిచేసుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు!
Actress Alaya Hot Comments on Marriage. సాధారణంగా అమ్మాయిలకు పెళ్లి వయసు 21,అబ్బాయిలకు 25 సంవత్సరాల తర్వాత
By Medi Samrat Published on 1 Jan 2021 3:18 AM GMTసాధారణంగా అమ్మాయిలకు పెళ్లి వయసు 21,అబ్బాయిలకు 25 సంవత్సరాల తర్వాత పెళ్లిళ్లు చేయాలని ప్రభుత్వాలు చట్టాలను చేశాయి. అయితే కొంత మంది మాత్రం పెళ్లి వయసు రాకనే పెళ్లిళ్లు చేస్తుంటారు.మరి కొంత మంది మాత్రం అమ్మాయిల చదువులు, ఉద్యోగాలలో స్థిరపడిన తరువాత వారి పెళ్లి చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ సెలబ్రిటీస్ మాత్రం తొందరగా పెళ్లిళ్లు చేసుకుంటే వారి సినీ ప్రస్థానం అంతటితో ఆగిపోతుందని భావించి 30 దాటినా కూడా పెళ్లిళ్లు చేసుకోరు. అయితే ఈ పెళ్లి విషయంపై బాలీవుడ్ బ్యూటీ "అలయ" ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 30 సంవత్సరాల వయసు కన్నా ముందే పెళ్లి చేసుకోవడం కన్నా మరొక మూర్ఖమైన పని మరొకటి లేదనే ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
"జవానీ జానేమన్" సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మోడల్ పూజా బేడీ కూతురు అలయ పెళ్లి పై ఈ విధంగా స్పందించారు.సాధారణంగా ఇండియాలో తమ పిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడుతుంటారు. కానీ నా విషయంలో నా తల్లిదండ్రులు ఇందుకు భిన్నంగా ఉన్నారని ఆమె తెలిపారు. తమ పేరెంట్స్ అందరిలా కాకుండా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఆలోచిస్తారని, ముందుగా ఒక వ్యక్తి తన కెరీర్, అలాగే పనిపై దృష్టి పెట్టాలని చెబుతుంటారు.
మన జీవితంలో మన సొంత కాళ్లపై మనం నిలబడటం నేర్చుకోవాలని తన తల్లిదండ్రులు సూచిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే అలయ ఐదు సంవత్సరాల వయసులోనే తమ తల్లిదండ్రులు విడిపోయిన విషయాన్ని కూడా ఆమె ఇంటర్వ్యూ ద్వారా గుర్తు చేసుకున్నారు. అయితే తమ తల్లిదండ్రులు కేవలం విడాకులు మాత్రమే తీసుకున్నారని పిల్లలపట్ల వారిద్దరూ ఎంతో జాగ్రత్తగా ఉంటూ, మాకు ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారని ఈ సందర్భంగా అలయ తెలిపారు.