ఎన్టీఆర్ శతజయంతి : ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
Actors Junior NTR and Kalyan Ram Tributes to NTR.తెలుగు ప్రజలు ఆరాధ్య ధైవంగా భావించే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు
By తోట వంశీ కుమార్ Published on 28 May 2022 2:39 AM GMT
తెలుగు ప్రజలు ఆరాధ్య ధైవంగా భావించే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈరోజు(శనివారం) తెల్లవారుజామునే నటులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఘాట్ వద్ద పుష్పగుచ్చాలను ఉంచారు. ఈ సందర్భంగా అభిమానులు' జై ఎన్టీఆర్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అంతకముందు.. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్.. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ.. . 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసులో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను 'అంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP
— Jr NTR (@tarak9999) May 28, 2022
అటు లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ అసమాన ప్రతిభ కలిగిన నటుడు ఎన్టీఆర్ అని, తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా పేరుగాంచారని తెలిపారు.