మూడుముళ్ల బంధంతో ఒక్కటైన అదితిరావు - సిద్ధార్థ్

నటీనటులు అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది.

By అంజి  Published on  16 Sept 2024 11:51 AM IST
Actors Aditi Rao Hydari, Siddharth, traditional South Indian ceremony, Wedding

మూడుముళ్ల బంధంతో ఒక్కటైన అదితిరావు - సిద్ధార్థ 

నటీనటులు అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వధూవరులు ఇద్దరూ తమ వివాహానికి సంప్రదాయ దుస్తులను ఎంచుకున్నారు. "నువ్వు నా సూర్యుడు, నా చంద్రుడు, నా నక్షత్రాలన్నీ" అని అందమైన క్యాప్షన్‌తో అదితి రావు హైదరి తమ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.

కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి నెటిజన్లు శుభాకాంక్షాలు చెబుతున్నారు.

అదితి గోల్డెన్ జారీ వర్క్‌తో కూడిన అద్భుతమైన టిష్యూ ఆర్గాన్జా లెహంగాను ధరించింది. వధువు తన లెహంగాను చారలు, చేతితో ఎంబ్రాయిడరీ చేసిన బార్డర్‌తో సరిపోయే గోల్డెన్ బ్లౌజ్‌తో జత చేసింది. వరుడు సిద్ధార్థ్‌ సాంప్రదాయ వేష్టి బాటమ్‌తో స్టైల్ చేసిన మైక్రో ఎంబ్రాయిడరీతో కూడిన కుర్తా ధరించాడు.

Next Story