హీరో విశాల్‏కు తృటిలో తప్పిన ప్రమాదం

Actor Vishal escaped mishap while shooting.క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో క‌రోనా నిబంధ‌న‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2021 6:26 AM GMT
హీరో విశాల్‏కు తృటిలో తప్పిన ప్రమాదం

క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ సినిమా షూటింగ్‌లు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. త‌మిళ స్టార్ హీరో విశాల్ న‌టిస్తున్న ఓ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రామోజీఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ యాక్ష‌న్ సీక్వెల్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో భాగంగా డూప్ లేకుండానే ఫైటింగ్ సీన్ చేస్తున్న విశాల్ తల వెనుక భాగంలో ఓ సీసా త‌గిలింది. దీంతో విశాల్ త‌ల‌కు గాయ‌మైంది. అయితే.. అదృష్ట‌వ‌శాత్తు ఆయ‌న‌కు పెద్ద‌గా ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయమైన‌ప్ప‌టికి అలాగే ఆపైట్ స్వీకెన్స్‌ను బ్రేక్ తీసుకోకుండా పూర్తి చేశారు విశాల్‌.

దీనిపై విశాల్ ట్వీట్ చేశాడు. అదృష్ట‌వశాత్తు ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్నాను. స్టంట్ ఆర్టిస్టుల త‌ప్పేమి లేదు. జ‌స్ట్ టైమింగ్ మిస్‌. యాక్ష‌న్ సీక్వెన్స్‌లో ఇలాంటివి జ‌ర‌గ‌డం కామ‌న్. దేవుడి దయ, మీ ప్రేమతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేశాం.. యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంత అద్బుతంగా తెరకెక్కించినందుకు థ్యాంక్స్ టు రవివర్మ మాస్టర్ అని విశాల్‌ చెప్పుకొచ్చారు.ఫైట్‌ సీన్స్‌కు సంబంధించిన వీడియోను విశాల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది.

Next Story
Share it