ఆ పిల్లలకు ఉచిత విద్య అందించండి : సోనూ సూద్

Actor Sonu Sood requests govts to provide free education.క‌రోనా కార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారుల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సాయం చేయాల‌ని సోనూ సూద్ కోరారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2021 2:06 PM IST
Sonu Sood

క‌రోనా వైర‌స్‌ విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేసింది. ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మంది నిరుపేద‌ల‌కు సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌. ఇప్ప‌టికి కూడా త‌న వంతు సాయం చేస్తున్నాడు. కాగా.. క‌రోనా కార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారుల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సాయం చేయాల‌ని ఆయ‌న కోరారు.

తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. దేశంలో క‌రోనా విజృంభిస్తోంద‌ని.. ఎంతో మంది క‌రోనా బారిన ప‌డి మ‌రణిస్తున్నార‌ని.. వారి పిల్ల‌ల భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంగా మారుతోంద‌ని సోనూసూద్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఐదేళ్లు, 8 ఏళ్లు, 12 ఏళ్ల వయసున్న ఎంతో మంది చిన్నారుల తల్లిదండ్రులనూ కరోనా కబళించిందన్నాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారుల భవిష్యత్ ఏంటో తలచుకుంటుంటూనే చాలా భయంగా, బాధగా ఉందన్నారు. ఆ చిన్నారులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఆ చిన్నారులకు ఉచిత విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని ఆ వీడియోలో సోనూసూద్‌ కోరారు.




Next Story