సిద్ధార్థ్ అంత మంచోడేమీ కాదు.. సమంతపై ఇన్ డైరెక్ట్‌గా గతంలో చేసిన ట్వీట్ వైరల్

actor Siddharth's old tweet indirectly targetting Samantha Ruth Prabhu goes VIRAL. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపియన్ సైనా నెహ్వాల్‌పై

By Medi Samrat
Published on : 12 Jan 2022 4:39 PM IST

సిద్ధార్థ్ అంత మంచోడేమీ కాదు.. సమంతపై ఇన్ డైరెక్ట్‌గా గతంలో చేసిన ట్వీట్ వైరల్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపియన్ సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో సిద్ధార్థ్ సైనాకు క్షమాపణలు చెప్పాడు. డియర్ సైనా నేనో అసభ్యకరమైన జోక్ చేశానని, అందుకు క్షమించాలని కోరాడు. మీ ట్వీట్‌కు తాను స్పందించిన తీరు, వాడిన భాష సరికాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అది తాను దురుద్దేశంతో చేసిన ట్వీట్ కాదని, మహిళలంటే తనకు ఎనలేని గౌరవమని చెప్పుకొచ్చాడు. తన ట్వీట్‌లో లింగ వివక్ష ఏమీ లేదని, మీరు మహిళ కాబట్టి దాడి చేయాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రమూ లేదని అన్నాడు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెడదామని .. మీరెప్పుడూ నా చాంపియనేనని, తన క్షమాపణలు అంగీకరిస్తారని ఆశిస్తున్నానంటూ ఆ లేఖలో చెప్పుకొచ్చాడు.

సైనాపై సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదం ముగియకముందే.. సౌత్ స్టార్ సమంత రూత్ ప్రభు గురించి అతడు చేసిన పాత ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.సౌత్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య తమ విడాకుల గురించి ప్రకటించిన వెంటనే సిద్ధార్థ్ 'మోసగాళ్ల' గురించి ట్వీట్ చేశారు. "నేను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుని నుండి నేర్చుకున్న మొదటి పాఠాలలో ఒకటి... "మోసగాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందరు." మీది ఏమిటి? (sic)."("One of the first lessons I learnt from a teacher in school... "Cheaters never prosper." What's yours? (sic)." )


సిద్ధార్థ్ సమంతపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడని, ఆమె విడాకుల విషయంలో ఆమెను లక్ష్యంగా చేయడంపై నెటిజన్లు షాక్ అయ్యారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు సిద్ధార్థ్ పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు, సిద్ధార్థ్-సైనా వివాదం మధ్య, సమంత గురించి సిద్ధూ ట్వీట్ మరోసారి తెరపైకి వచ్చింది. నెటిజన్లు నటుడిని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే రిపీట్ అఫెండర్ అని పిలిచారు. అతడిని ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడడం కొత్తేమీ కాదని పలువురు సోషల్ మీడియాలో సిద్ధూని టార్గెట్ చేశారు.



Next Story