విష్ణుప్రియ బర్త్‌ డే.. బోలెడు బంగారంతో నటుడు సర్​ప్రైజ్

Actor Siddharth Varma Gifted Gold Jewellery To His Wife Actress Vishnu Priya. బుల్లితెర స్టార్‌, అందాల ముద్దుగుమ్మ, నటి విష్ణుప్రియ గురించి టీవీ ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అవసరం లేదు.

By అంజి
Published on : 28 Aug 2022 5:59 AM

విష్ణుప్రియ బర్త్‌ డే.. బోలెడు బంగారంతో నటుడు సర్​ప్రైజ్

బుల్లితెర స్టార్‌, అందాల ముద్దుగుమ్మ, నటి విష్ణుప్రియ గురించి టీవీ ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అవసరం లేదు. తాజాగా ఆమె బర్త్‌ డే సందర్భంగా నటుడు, ఆమె భర్త ఏకంగా 200 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. టీవీ యాక్టర్‌ విష్ణు ప్రియ సీరియల్స్‌లో తనదైన నటనతో ప్రేక్షకుల ఆదర అభిమానాలను చూరగొంటొంది. లేటెస్ట్‌గా ఈ అమ్మడు తన పుట్టిన రోజు కోసం షాపింగ్‌ చేసింది. తన భర్త, నటుడు సిద్ధార్థ్‌ వర్మతో కలిసి బంగారు ఆభరణాల షాపుకు వెళ్లింది.

అక్కడ తనకు నచ్చిన గాజులు, నెక్లెస్‌, ఇయర్‌ రింగ్స్‌లు సెలెక్ట్‌ చేసుకుంది. ఆ ఆభరణాలన్నీ కలిపి 200 గ్రాములకు పైనే ఉంటాయని అని చెప్పుకొచ్చింది. ఆమె సెలక్ట్‌ చేశాక సిద్ధార్థ్‌ వాటన్నింటినీ ప్యాక్‌ చేసి బర్త్​డే గిఫ్ట్​గా ఆమెకు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను 'నా బర్త్‌ డేకి మావారి బంగారు కానుక' అంటూ విష్ణు తన యూట్యూబ్‌లో అప్లోడ్​ చేసింది. బంగారం లాంటి భార్య కోసం ఈ మాత్రం బంగారం కొనివ్వలేనా అని భర్త సిద్ధార్థ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు అమ్మాయిలు, కుంకుమపువ్వు, నువ్వే కావాలి, అభిషేకం, త్రినయని తదితర సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు విష్ణుప్రియ బాగా దగ్గరైంది.

Next Story