సినీ ఇండస్ట్రీలో విషాదం.. వర్కౌట్‌ చేస్తూ ప్రముఖ నటుడు మృతి

Actor Siddhaanth Vir Surryavanshi dies at 46. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, మోడల్‌ సిద్ధాంత్ వీర్ సూర్యవంశ్ ఇవాళ కన్నుమూశారు.

By అంజి  Published on  11 Nov 2022 4:38 PM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. వర్కౌట్‌ చేస్తూ ప్రముఖ నటుడు మృతి

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, మోడల్‌ సిద్ధాంత్ వీర్ సూర్యవంశ్ ఇవాళ కన్నుమూశారు. టీవీ నటుడు సిద్ధాంత్ వీర్‌ వయస్సు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనిని 45 నిమిషాల పాటు బ్రతికించడానికి ప్రయత్నించారు. కానీ కాపాడలేకపోయారు. సిద్ధాంత్ వీర్ మృతితో బాలీవుడ్‌ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సిద్ధాంత్ వీర్‌కు భార్య, ఇద్దరూ పిల్లలు ఉన్నారు.

సిద్ధాంత్ వీర్ పలు టీవీ షోలలో నటించారు. సుఫియానా ఇష్క్‌ మేరా, జిద్ది దిల్‌ మానే నా, వారిస్‌, సాత్‌ ఫేరే: సలోని కా సఫర్‌, కసౌతి జిందగీ కే సీరియల్స్‌తో పాటు పలు బుల్లితెర షోలలో కనిపించాడు. కసౌతి జిందగీ కే సీరియల్‌ ద్వారా సిద్ధాంత్‌ మంచి పేరు సంపాదించుకున్నాడు. సిద్ధాంత్‌ అసలు ఆనంద్‌. ఇటీవలే పేరు మార్చుకున్నాడు. అతను విరుధ్, భాగ్యవిధాత, క్యా దిల్ మే హై వంటి టీవీ షోలలో కూడా కనిపించాడు. సిద్ధాంత్ వీర్ మృతి పట్ల బాలీవుడు నటులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నటులు.. సిద్ధాంత్‌ కలిసి పని చేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.



Next Story