యంగ్ హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందోచ్

Actor Sharwanand gets engaged. శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే శ‌ర్వా పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2023 1:01 PM IST
యంగ్ హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందోచ్

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ల‌లో శ‌ర్వానంద్ ఒక‌డు. అయితే.. త్వ‌ర‌లోనే శ‌ర్వా పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నాడు. గురువారం శ‌ర్వానంద్‌-ర‌క్షితారెడ్డి నిశ్చితార్థం జ‌రిగింది. అతి కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. శ‌ర్వా, రక్షిత ఒక‌రికొక‌రు ఉంగ‌రాలు మార్చుకున్నారు. ఓ హోట‌ల్‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు శ‌ర్వానంద్ ప్రాణ స్నేహితుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న హాజ‌ర‌య్యారు. కాబోయే వ‌ధూవ‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

త‌న‌కు కాబోయే భార్య‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా శ‌ర్వా అంద‌రికి ప‌రిచ‌యం చేశాడు. "ఈమె నా ప్రియ‌మైన రక్షిత‌. ఈ అంద‌మైన అమ్మాయితో క‌లిసి జీవితంలో పెద్ద అడుగు వేస్తున్న‌. ఈ సంద‌ర్భంగా మీ అంద‌రి ఆశీస్సులు కావాల‌ని" శ‌ర్వా ట్వీట్ చేశాడు.

మ‌రో ట్వీట్‌లో నిశ్చితార్థం ఫోటోల‌ను షేర్ చేశాడు. ప్ర‌స్తుతం వీరి నిశ్చితార్థం ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. వీటిని చూసిన నెటీజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ర‌క్షిత యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌ని చేస్తోంది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే శ‌ర్వా న‌టించిన ఒకే ఒక జీవితం ఇటీవ‌ల విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను పొందింది. ఈ చిత్రం త‌రువాత శ‌ర్వా కొత్త‌సినిమా ప్రాజెక్టుల‌ను ఏమీ ప్ర‌క‌టించ‌లేదు. పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉండ‌డంతో సినిమాల‌కు కొంత విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.


Next Story