మరో వివాదంలో హీరోయిన్ సంజనా.. మద్యం బాటిల్ తో దాడి చేసిందట.!

Actor Sanjjanna in legal trouble. పార్టీ సజావుగా సాగుతున్న సమయంలో వందన, సంజన‌ మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలో సంజన గ‌ల్రానీ... మద్యం బాటిల్‌తో వందనపై దాడి చేయడంతో గాయాలయ్యాయి.

By Medi Samrat  Published on  19 May 2021 9:51 AM GMT
Sanjjanna

సంజ‌నా గ‌ల్రానీ.. దక్షిణాదిన నటిగా కొద్దో గొప్పో గుర్తింపు తెచ్చుకున్నా.. మాదక ద్రవ్యాల కేసులో పేరు బయటకు రావడంతో ఆమె సినీ కెరీర్ దాదాపు ముగిసినట్లేనని భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమె మరోసారి చిక్కుల్లో పడింది. గతంలో ఆమె చేసిన ఓ పనికి ఇప్పుడు మరో కేసు నమోదైంది. బెంగుళూరు కోర్టు ఆదేశాల మేరకు బెంగుళూరు కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2019 డిసెంబరు 24న చోటు చేసుకున్న ఘటన అట..!

చిత్ర నిర్మాత వందన జైన్‌ కిస్మస్‌ పండగను పురస్కరించుకుని కొంతమంది సినీ సెలెబ్రిటీలకు బెంగళూరు లోని కేజ్ క్లబ్‌లో గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సంజనా గల్రానీ కూడా హాజరయ్యారు. పార్టీ సజావుగా సాగుతున్న సమయంలో వందన, సంజన‌ మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలో సంజన గ‌ల్రానీ... మద్యం బాటిల్‌తో వందనపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కబ్బన్‌ పార్క్‌ పోలీసు లకు వందన జైన్‌ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కేసు నమోదుచేసి రెండేళ్ళు గడిచినా పోలీసులు మాత్రం సంజనాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో వందన జైన్‌ తరపు న్యాయవాదులు స్థానిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి సంజనాపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో స్పందించిన పోలీసులు సంజనపై కేసు నమోదు చేశారు.

కబ్బన్ పార్క్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 326 A , 335, 323, 324, 506, 504ల కింద కేసును నమోదు చేసారు. పోలీసులు ఈ ఘటనపై సంజనా గల్రానిని ప్రశ్నించనున్నారు. ఈ పార్టీకి హాజరు అయిన వారిని కూడా విచారించనున్నారు. ఈ పార్టీలో వందనను ఇష్టం వచ్చినట్లు సంజనా తిట్టిందని తెలుస్తోంది. సంజనా తన మీద బాటిల్ తో దాడి చేయడం వలన విస్కీ కళ్ళల్లోకి పడిందని.. ఎంతో మంటగా అనిపించిందని వందన తన పిర్యాదులో చెప్పుకొచ్చిం


Next Story
Share it