ఆస్ప‌త్రిలో సాయిధరమ్ తేజ్.. మ‌రో హెల్త్ బులెటిన్ విడుదల

Actor Sai Dharam Tej Second health bulletin.హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌డంతో ప్ర‌స్తుతం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sep 2021 5:19 AM GMT
ఆస్ప‌త్రిలో సాయిధరమ్ తేజ్.. మ‌రో హెల్త్ బులెటిన్ విడుదల

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌డంతో ప్ర‌స్తుతం అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అపోలో ఆస్ప‌త్రి వైద్యులు సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్య ప‌రిస్థితిపై మ‌రో బులిటెన్‌ను విడుద‌ల చేశారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌న్నారు. ప్ర‌ధాన అవ‌య‌వాలు బాగానే ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు. ఐసియూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌నున్న‌ట్లు ఆ బులిటెన్‌లో తెలిపారు.


ఇక‌.. సాయిధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ప‌లువురు ప్ర‌ముఖులు ఆస్ప‌త్రికి క్యూ క‌డుతున్నారు. సినీ నటి రాశీఖన్నా, నటుడు ప్రకాశ్ రాజ్, హీరో శ్రీకాంత్ అపోలో ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్‌ను చూసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తేజ్ కుటుంబసభ్యులనడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ప్ర‌కాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. సాయి తేజ్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌న్నారు. సాయి ఒక ఫైట‌ర్ అని మ‌నంద‌రికి తెలుసు.. అత‌ను త్వ‌ర‌గా కోలుకుంటారు అని ప్ర‌కాశ్‌రాజ్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. సాయి తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కానుంది. ఇందులో సాయి తేజ్ క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు.

Next Story