న‌టుడు ర‌వి కిష‌న్ ఇంట తీవ్ర విషాదం

Actor Ravi Kishan's elder brother succumbs to cancer.ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు ర‌వి కిష‌న్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2022 2:20 PM IST
న‌టుడు ర‌వి కిష‌న్ ఇంట తీవ్ర విషాదం

ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు ర‌వి కిష‌న్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న సోద‌రుడు ర‌మేశ్ శుక్లా క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. బుధ‌వారం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ర‌వి కిష‌న్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియజేశారు.

త‌న సోద‌రుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తండ్రి గ‌తించిన కొద్ది రోజుల‌కే అన్న‌య్య కూడా అనంత లోకాల‌కు వెళ్ల‌డం తీర‌ని లోట‌న్నారు. త‌న అన్న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. రమేశ్ మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ర‌వి కిష‌న్‌.. భోజ్‌పురి, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో నటించారు. తెలుగులో రేసు గుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డి క్యారెక్టర్ లో తన విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. న‌టుడిగానే కాకుండా రాజ‌కీయాల్లోనూ కొన‌సాగుతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గోరఖ్​పుర్​ నియోజకవర్గం నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎంపీగా గెలుపొందారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

Next Story