రిలేషన్‌షిప్‌లో హీరోయిన్ రష్మిక మందన్నా!
'లక్ష్మణ్ ఉటేకర్' పీరియాడికల్ డ్రామా ఛావాలో నటిస్తున్న నటి రష్మిక మందన్న ఇటీవలి ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ధృవీకరించారు.
By అంజి Published on 28 Jan 2025 11:25 AM IST
రిలేషన్‌షిప్‌లో హీరోయిన్ రష్మిక మందన్నా!
'లక్ష్మణ్ ఉటేకర్' పీరియాడికల్ డ్రామా ఛావాలో నటిస్తున్న నటి రష్మిక మందన్న ఇటీవలి ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ధృవీకరించారు. అయితే, ఆమె తన భాగస్వామి పేరును ప్రస్తావించలేదు. రష్మిక తన 'డియర్ కామ్రేడ్' సహనటుడు విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ది హాలీవుడ్ రిపోర్టర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నటి తన 'హ్యాపీ ప్లేస్' గురించి చెప్పారు. ''నాకు సంతోషకరమైన ప్రదేశం ఏది అని అడిగితే వెంటనే ఇల్లు అని చెబుతాను. ఇంట్లో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఎక్కడా పొందలేని ఆనందం ఇంట్లో లభిస్తుంది. ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ నేను ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా నా జీవితాన్ని గౌరవిస్తాను. అది పూర్తిగా నా వ్యక్తిగత జీవితం'' అని చెప్పారు.
'కళ్లు మన మనసుకు ప్రతిబింబాలు. కళ్లతో పలికించే హవభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులను ఇష్టపడతాను. అలాగే ఎదుటివారిని గౌరవించే వారంటే నాకు ఇష్టం' అని రష్మిక చెప్పారు. దీంతో రష్మిక భాగస్వామి గురించిన మాట్లడటంతో ఆమె వాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రిలేషన్ షిప్‌లో ఉన్నారా? అని రష్మికకు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కూడా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఒప్పుకున్నాడు. అయితే, తనకు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే తన ప్రేమ జీవిత వివరాలను పంచుకుంటానని కూడా అతను స్పష్టం చేశాడు . తన వ్యక్తిగత జీవితంపై అభిమానుల ఉత్సుకతను అంగీకరిస్తూ, తన చుట్టూ ఉన్న ఒత్తిడి కారణంగా తాను ఎప్పుడూ చర్చించనని కూడా పేర్కొన్నాడు. రష్మిక మందన్న గతేడాది విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకుంది . ఆమె తన చివరి విడుదలైన పుష్ప 2ని కూడా దేవరకొండ కుటుంబంతో కలిసి చూసింది.