అత‌ని వల్లే నా తల్లి చనిపోయింది.. భ‌ర్త‌పై పోలీసుల‌కు రాఖీ సావంత్ ఫిర్యాదు

Actor Rakhi Sawant files complaint against husband. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ దురానీని ఓషివారా పోలీసులు మంగళవారం విచారణకు పిలిచారు

By M.S.R  Published on  7 Feb 2023 7:15 PM IST
అత‌ని వల్లే నా తల్లి చనిపోయింది.. భ‌ర్త‌పై పోలీసుల‌కు రాఖీ సావంత్ ఫిర్యాదు

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ దురానీని ఓషివారా పోలీసులు మంగళవారం విచారణకు పిలిచారు. తన భర్త ఆదిల్ ఖాన్ దురానీకి వివాహేతర సంబంధం ఉందని రాఖీ సావంత్ ఆరోపించింది. దీంతో అధికారులు విచారణకు పిలిచారని ఓ అధికారి తెలిపారు. కొన్ని వారాల కిందటే రాఖీ సావంత్ అతడిని పెళ్లి చేసుకుంది.

పోలీసు వర్గాల ప్రకారం.. రాఖీ సావంత్ తన భర్త మోసం చేశాడని ఓషివారా పోలీసుల వద్ద ఆదిల్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. తన భర్త వల్లే తన తల్లి చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు చెక్కులు ఇచ్చినా.. తన తల్లి శస్త్రచికిత్సకు డబ్బులు చెల్లించలేదని రాఖీ తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. ఓషివారా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ మనోహర్ ధనవాడే మాట్లాడుతూ, "ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదిల్ దురానీని విచారణకు పిలిచారు. రాఖీ సావంత్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేము అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తాము."

ఆదిల్ తన డబ్బులను దుర్వినియోగం చేశాడంటూ ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గతేడాది మరాఠీలో బిగ్ బాస్ లో పాల్గొంటున్న సమయంలో అనారోగ్యంతో ఉన్న తన అమ్మ జయా జశ్వంత్ ఆరోగ్యం చూసుకోవాలని అతనిని కోరినట్టు ఆమె పేర్కొంది. అయినప్పటికీ అమ్మ సర్జరీకి సకాలంలో డబ్బులు ఆదిల్ చెల్లించలేదని, ఆమె మరణానికి అతడే కారణమని ఆరోపించింది. అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నన్ను కొట్టి నా డబ్బులు దోచుకెళ్లాడు. ఖురాన్ పైనా ప్రమాణం చేశాడు. అయినా నన్ను మోసం చేశాడని రాఖీ సావంత్ పేర్కొంది. పోలీసులకు కావాల్సిన అన్ని ఆధారాలను సమర్పించినట్టు రాఖీ సావంత్ తెలిపింది.


Next Story