తారకరత్న మృతిపై వైసీపీ నాయకురాలు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తారకరత్న ఎప్పుడో చనిపోతే తమ స్వార్థ రాజకీయాలకోసం ఆసుప్రతిలో ఉంచి మరణవార్తను ఇన్నిరోజులు దాచిపెట్టారంటూ చంద్రబాబుపై ఆమె ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నటుడు పృధ్వీరాజ్ స్పందించారు. తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు తప్పు అని, ఆ దరిద్రపు వ్యాఖ్యలు గురించి మాట్లాడటం అనవసరం అని పృథ్వీ అన్నారు. నందమూరి కుటుంబం గురించి ఆమెకు ఎప్పటినుంచి తెలుసో నాకు తెలియదు. కానీ, నాకు చిన్నప్పటి నుంచి వారితో అనుబంధం ఉందని అన్నారు. తారకరత్న ఎంతో మంచివాడని, వెంకటాద్రి సినిమాకి తారకరత్నతో కలిసి నేను నటించానని పృథ్వీ తెలిపారు.
నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖుల నడుమ అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు తారకరత్న అంతిమయాత్ర ఫిలించాంబర్ నుంచి ప్రారంభమైంది. తారకరత్న చితికి ఆయన తండ్రి మోహనకృష్ణ నిప్పంటించారు.