ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పొలిటికల్ కామెంట్స్..హైబీపీతో హాస్పిటల్‌లో చేరిన పృథ్వీ
హైబీపీ కారణంగా ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
By Knakam Karthik
ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పొలిటికల్ కామెంట్స్..హైబీపీతో హాస్పిటల్‌లో చేరిన పృథ్వీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్‌గా నటించిన లైలా మూవీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఓ రాజకీయ వర్గానికి కోపం తెప్పించడంతో సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ బాయ్ కాట్ లైలా ట్రెండ్ అవుతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో బాయ్ కాట్ ఇష్యూ ఇంకా ముదురుతుంది. కాగా ఈ వివాదానికి కారణమైన నటుడు పృథ్వీ రాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీ కారణంగా ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మూవీ ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ యాక్టర్‌గా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్బీబీసీ భక్తి ఛానల్ ఛైర్మన్ పదవి దక్కింది. అయితే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేనకు దగ్గరై గత ఎన్నికల్లో జనసేన తరపున క్యాంపెయన్ కూడా చేశారు. ఇక ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమా ఈవెంట్‌లోనైనా వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న ఆయన.. లేటెస్ట్‌గా లైలా ప్రి రిలీజ్ ఈవెంట్‌లోనూ వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ హాట్ కామెంట్స్ చేశారు.
పృథ్వీరాజ్ కామెంట్స్ రియాక్ట్ అయిన వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లైలా మూవీ బాయ్‌కాట్ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పృథ్వీ మాట్లాడిన మాటలకు తమకు సంబంధం లేదని హీరో విశ్వక్ సేన్‌తో పాటు ప్రొడ్యూసర్ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పారు. ఈ క్రమంలోనే పొలిటికల్ కామెంట్స్ చేసిన ఆయన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. ఆయనకు హై బీపీ రావడంతో ఆయన సన్నిహితులు హాస్పిటల్‌కు తరలించారు. పృథ్వీ రాజ్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.