వారందరికీ షాకిచ్చిన ప్రభాస్

Actor Prabhas new look goes viral.ఇటీవల విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో అతడి లుక్స్ గురించి తీవ్ర విమర్శలు వచ్చిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 3:04 PM IST
వారందరికీ షాకిచ్చిన ప్రభాస్

ఇటీవల విడుదలైన ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాలో అతడి లుక్స్ గురించి తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే..! అయితే ఆ తర్వాత వర్కౌట్స్ చేసి.. మళ్లీ ఫిజిక్ ను సొంతం చేసుకున్నాడని తాజాగా వచ్చిన ఫొటోస్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్‌తో కలిసి ప్రభాస్ ముంబైలో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ఇంట్లో పార్టీ కోసం కనిపించాడు. పాన్ ఇండియన్ స్టార్ పూర్తిగా నలుపు రంగు ఫార్మల్స్‌ను ఎంచుకున్నాడు. ఆదిపురుష్ టీమ్‌తో కలిసి కెమెరాలకు పోజులిస్తూ కనిపించాడు.

ప్రభాస్ కొంచెం బరువు కూడా తగ్గినట్లు కనిపిస్తున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో డైరెక్టర్ ఓంరౌత్ ఇంట్లో జరిగిన చిన్న పార్టీకి ప్రభాస్ ముంబైకి వెళ్ళాడు. ఆదిపురుష్ టీం మొత్తం ఓంరౌత్ ఇంట్లో సందడి చేశారు. పూర్తిగా వెయిట్ లాస్ అయ్యి మరింత స్లిమ్ అండ్ స్టైలిష్ గా కనిపించి తన లుక్స్ తో అందరిని కట్టిపడేశాడు డార్లింగ్. కొద్దిరోజుల కిందట ట్రోల్ చేసిన వ్యక్తులే ఇప్పుడు ప్రభాస్ మేకోవర్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

Next Story