సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన న‌టుడు మంచు మ‌నోజ్‌

Actor Manchu Manoj meets CM Jagan.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగ‌న్‌ను సినీ న‌టుడు మంచు మ‌నోజ్ సోమ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2021 7:17 AM GMT
సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన న‌టుడు మంచు మ‌నోజ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగ‌న్‌ను సినీ న‌టుడు మంచు మ‌నోజ్ సోమ‌వారం క‌లిశారు. ఈ విష‌యాన్ని మ‌నోజ్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం గౌర‌వంగా బావిస్తున్నాన‌ని.. ఆయ‌న ముందు చూపు క‌లిగిన వ్య‌క్తి అని మ‌నోజ్ ట్వీట్ చేశారు.

'ముఖ్య‌మంత్రి జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు, ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకున్న దార్శనికతకు ముగ్దుడినయ్యాను. మీరు అనుకున్న అన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసే శ‌క్తిని ఆ భ‌గ‌వంతుడు మీకు ఇవ్వాల‌ని కోరుకుంటున్నా. మీ పాల‌న‌కు శుభాకాంక్ష‌లు' అని మ‌నోజ్ ట్వీట్ చేశాడు.

Next Story
Share it