కారుతో బైక్‌ను ఢీకొట్టిన బుల్లితెర నటి లహరి..!
Actor Lahari hit Bike with Car in Shamshabad.ప్రమాద వశాత్తు బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని తన కారుతో
By తోట వంశీ కుమార్ Published on
8 Dec 2021 3:26 AM GMT

ప్రమాద వశాత్తు బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని తన కారుతో బుల్లితెర నటి లహరి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన శంషాబాద్‌లో జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తరువాత జనాలు గుమిగూడడంతో.. భయపడిన లహరి కారులోంచి కిందకు దిగలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
కారుతో పాటు నటి లహరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఔటర్ రింగ్ రోడ్డు పై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి.. డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక లహరి మద్యం తాగి వాహనం నడిపిందా..? అన్న అనుమానంతో పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఆమె మద్యం సేవించలేదని తెలిసింది. గాయపడిన వ్యక్తి తరుపున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఆమెను ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది.
Next Story