యాంకర్ విష్ణుప్రియతో పెళ్లిపై.. జేడీ చక్రవర్తి ఏమన్నారంటే?
కొన్ని నెలల క్రితం ఓ సెలబ్రిటీ గేమ్ షోలో పాల్గొన్న యాంకర్ విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. నటుడు జెడీ చక్రవర్తిని
By అంజి Published on 18 Jun 2023 9:07 AM ISTయాంకర్ విష్ణుప్రియతో పెళ్లిపై.. జేడీ చక్రవర్తి ఏమన్నారంటే?
కొన్ని నెలల క్రితం ఓ సెలబ్రిటీ గేమ్ షోలో పాల్గొన్న యాంకర్ విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. నటుడు జెడీ చక్రవర్తిని ప్రేమిస్తున్నానని, ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని, అవకాశం వస్తే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నానని స్పష్టం చేసింది. జేడీ చక్రవర్తి వాళ్లమ్మ అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని అంది. విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో జెడి చక్రవర్తి స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీ.. విష్ణుప్రియ అలా మాట్లాడటానికి గల కారణాన్ని వెల్లడించారు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని, అయితే లవ్ కాదని తేల్చేశారు. తమ మధ్య గురు శిష్యుల లాంటి బంధం ఉందన్నారు. విష్ణుప్రియ ఎంతో మంచి అమ్మాయని చెప్పారు.
ఇటీవల ఇద్దరం కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించామని, అది త్వరలోనే ఆడియోన్స్ ముందుకు వస్తుందని తెలిపారు. ఆ సిరీస్ కోసం విష్ణుప్రియ, తాను 40 రోజుల పాటు కలిసి వర్క్ చేశామన్నారు. ఓ రోజు సిరీస్ డైరెక్టర్ పవన్ సాధినేని.. విష్ణుప్రియకు చిన్న అడ్వైజ్ ఇచ్చాడు. అదేంటంటే.. ప్రతి రోజు తాను నటించిన ఒక సినిమా చూడమని చెప్పాడు. అలా తాను నటించిన సినిమాలన్నీ చూసి తాను చేసిన రోల్స్‌తో ఆమె లవ్‌లో పడ్డారని, అంతేకానీ.. తనను ప్రేమించలేదని జేడీ చెప్పుకొచ్చాడు. తాను, విష్ణుప్రియ తక్కువగా మాట్లాడకుంటామన్నారు. దీంతో విష్ణుప్రియతో పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు జేడీ చెక్ పెట్టాడు. ఇకనైనా ఈ పుకార్లు షికార్లు చేయకుండా ఆగిపోతాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.