బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. విజయ్ దేవరకొండ పిరికివాడు
Actor Ananya Panday comments on Vijay Devarakonda.బాలీవుడ్ నటుడు చంకీ పాండే కుమారైగా సినీ ఇండస్ట్రీలో
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2022 2:36 PM ISTబాలీవుడ్ నటుడు చంకీ పాండే కుమారైగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అనన్య పాండే. తాజాగా అమ్మడు టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. పూరీ జగన్నాద్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో 'లైగర్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తోంది. చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుండగా.. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల విజయ్‌దేవరకొండ, అనన్య పాండే ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనన్య.. విజయ్ మంచి కో స్టార్ అని కితాబు ఇస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండ సినిమాల్లో కనిపించేదానికి పూర్తి భిన్నంగా బయట ఉంటాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. విజయ్ సహజంగా పిరికివాడని చెప్పింది. విజయ్ నటించిన 'అర్జున్‌రెడ్డి' సినిమా అంటే తనకు చాలా ఇష్టంమని.. అందులో విజయ్ క్యారెక్టర్‌కి బయట విజయ్ క్యారెక్టర్‌కి అస్సలు సంబంధమే ఉండదని ఆమె చెప్పింది. ఒక్కోసారి అతడిని చూస్తే తనకు ఆశ్చర్యం వేస్తుందని తెలిపింది. ఇక సినిమాల్లో అతడి పాత్రలన్ని ధైర్యవంతంగా ఉంటాయని.. అయితేబయట మాత్రం విజయ్ చాలా భయపడుతాడు సహజంగా విజయ్ పిరికివాడు అని చెప్పింది. కానీ.. విజయ్ మంచి సహానటుడని.. ఒక కో-స్టార్ నుంచి ఎలాంటి కంఫర్ట్స్ ఉండాలనుకుంటామో అవన్ని విజయ్ దగ్గర ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం అమ్మడు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఇక 'లైగర్' చిత్రం విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్ జోహార్‌తో కలిసి తన సొంత బ్యానర్‌లో పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేశాయి. ప్రముఖ బాక్సర్ మైఖ్ టైసన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.