అల్లు అర్జున్‌ సింప్లిసిటీ.. రోడ్డు పక్కన దాబాలో భోజనం

టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సింప్లిసిటీ చాటుకున్నారు.

By అంజి  Published on  21 May 2024 2:33 PM IST
actor Allu Arjun, dhaba, Pushpa, Tollywood

అల్లు అర్జున్‌ సింప్లిసిటీ.. రోడ్డు పక్కన దాబాలో భోజనం

టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సింప్లిసిటీ చాటుకున్నారు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో భోజనం చేశారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల నంద్యాల వెళ్లి తిరిగొచ్చే సమయంలో దాబాలో ఫుడ్‌ టేస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది.

ఏ ప్రాంతంలో ఈ దాబా అనే విషయాలకు సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలియదు. అల్లు అర్జున్ దంపతులు ఓ సాదా సీదా దాబాలో భోజనం చేస్తున్న ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. దీనిపై ఆయన టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో కూడా అల్లు అర్జున్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ రోడ్డు సైడ్‌ హోటల్‌కు వెళ్లి టిఫిన్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్‌ నటిస్తున్నారు.

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా కూడా అల్లు అర్జున్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. పుష్ప సినిమా ఇచ్చిన హైప్ తో పుష్ప-2 కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల పుష్ప-2 నుంచి వచ్చిన 'పుప్ప…పుష్ప' సాంగ్ అందరికి పూనకాలను లోడింగ్ చేసింది.

Next Story