పవన్ క‌ల్యాణ్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. ఆస్ప‌త్రిలో న‌టుడు ఆదిత్య మీన‌న్..!

Actor Adithya menon injured. పవన్ క‌ల్యాణ్ సినిమా షూటింగ్‌లో గాయాలైన ఆదిత్య‌మీన‌న్ ను వెంట‌నే ముంబైలోని యశోద ఆస్ప‌త్రికి తరలించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2021 9:45 AM GMT
Actor Adithya menon injured

షూటింగ్స్ లో ఒక్కొసారి చాలా రిస్క్‌తో కూడుకున్న ప‌రిస్థితులు ఎదురవుతాయి. మామూలు చిత్రాలు చేసేట‌ప్పుడు పెద్ద‌గా రిస్క్ ఉండ‌క‌పోవ‌చ్చు గానీ.. హిస్టోరిక‌ల్ చిత్రాలు చేసేట‌ప్పుడు చాలా రిస్కీ టేక్స్ చేయాల్సి వ‌స్తుంది. ఎందుకంటే హిస్టోరిక‌ల్ అంటేనే యుద్దాలు, గుర్ర‌పు స్వారీలు, క‌త్తిసాము, భారీ ఫైట్ సీక్వెన్స్ ఇలా ఎన్నో ర‌కాల స‌న్నివేశాల్లో న‌టించాల్సి వ‌స్తుంది. ఇలాంటి షూటింగ్స్ చేస్తూ చాలా మంది స్టార్స్ గాయ‌ప‌డ్డారు. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న చిత్రం 'హ‌రిహ‌రవీర‌మ‌ల్లు'. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోంది.

కాగా.. ప్ర‌ముఖ న‌టుడు ఆదిత్య‌మీన‌న్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అయితే.. ఆయ‌న గుర్రం మీద నుండి ఫ్లోర్ పై ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది. గాయాలైన ఆదిత్య‌మీన‌న్ ను వెంట‌నే ముంబైలోని యశోద ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు స‌మాచారం. అక్కడి చికిత్స అనంత‌రం ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నార‌ట‌. ఈ ప్ర‌మాదం నాలుగు రోజుల క్రితం జ‌రుగ‌గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆదిత్య‌మీన‌న్ కు చికిత్స కొన‌సాగుతుంద‌ని, ఆయ‌న కోలుకుంటున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయన ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

2009లో మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన‌ బిల్లా సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్య మీన‌న్‌. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేసాడు.


Next Story
Share it