ఎలిమినేట్ అయిన అభినయ ఏమి చెబుతోందంటే..?
Abhinaya Sri who made sensational comments on Bigg Boss contestants. ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లో మొదటి వారంలో ఎలిమినేషన్ జరగకపోగా.. రెండో వారం లో మాత్రం డబుల్ ఎ
By అంజి Published on 20 Sept 2022 8:30 PM ISTఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లో మొదటి వారంలో ఎలిమినేషన్ జరగకపోగా.. రెండో వారం లో మాత్రం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం రోజున షానీ హౌస్ నుంచి అవుట్ అవ్వగా.. ఆదివారం ఎపిసోడ్ లో అభినయ శ్రీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అభినయ ఎలిమినేషన్, ఆ తరువాత ఆమె షోలో కీలక కామెంట్లు చేశారు. ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన అభినయ ఇంట్లో హానెస్ట్‌గా ఉన్న ఐదుగురు, హానెస్ట్‌గా లేని ఐదుగురి పేర్లు చెప్పింది. హానెస్ట్ లో ఫైమా, చంటి, శ్రీ సత్య, బాలాదిత్య, సూర్యల పేర్లు చెప్పింది అభినయ. అలాగే హానెస్ట్‌గా లేనివాళ్లలో రేవంత్ ఒక్కడి పేరే చెప్పింది అభినయ.
ఇక షో నుండి బయటకు వచ్చాక అభినయ సంచలన విషయాలను చెప్పుకొచ్చింది. నా విషయంలో చాలా అన్యాయం జరిగిందనే నేను భావిస్తున్నాను. నాకు సంబంధించిన క్లిప్స్ బయటికి పెద్దగా రాలేదనే విషయం నేను బయటికి వచ్చిన తరువాత నాకు తెలిసింది. నేను దిగాలుగా కూర్చుని ఉండటమే చూపించారుగానీ, నేను మాట్లాడింది, డాన్సులు చేసింది చూపించలేదు. తనకు సంబంధించిన చాలా విషయాలు ఏవీ టీవీలో చూపించలేదని ఆమె ఆరోపించింది. ఓటింగ్ విషయంలో నా కంటే క్రింద పొజిషన్ లో ఇద్దరు ఉన్నారు. కానీ వాళ్లు సేవ్ కావడం, నేను ఎలిమినేట్ కావడం ఆశ్చర్యంగా అనిపించింది. నాలోని టాలెంట్ ను చూపించుకోవడానికే నేను బిగ్ బాస్ కి వెళ్లాను. కానీ డే వన్ నుంచి అలా చూపించడం జరగలేదని, నేను బయటికి వచ్చిన తరువాత మా అమ్మ, నా ఫ్రెండ్స్ చెప్పారని అభినయ అంది. బిగ్ బాస్ అంతా మోసం నాకు సంబంధించిన సెండాఫ్ వీడియోను గంట షోలో కనీసం ఐదు నిమిషాలు కూడా చూపించలేదు. ఆ షో నాకు హెల్ప్ అవ్వలేదు.. అందులో పాల్గొన్నందుకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇవ్వలేదని వాపోయింది.