మొదటి భార్యతో విడాకులు..రోజుకో బాటిల్ మద్యం తాగేవాడిని: ఆమిర్ ఖాన్
రీనా దత్తా నుండి విడాకులు తీసుకున్న తర్వాత తాను మద్యానికి బానిసయ్యానని, తీవ్ర నిరాశలో కూరుకుపోయానని ఆమిర్ ఖాన్ చెప్పారు.
By Knakam Karthik
మొదటి భార్యతో విడాకులు..రోజుకో బాటిల్ మద్యం తాగేవాడిని: ఆమిర్ ఖాన్
రీనా దత్తా నుండి విడాకులు తీసుకున్న తర్వాత తాను మద్యానికి బానిసయ్యానని, తీవ్ర నిరాశలో కూరుకుపోయానని ఆమిర్ ఖాన్ చెప్పారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన లేటెస్ట్‌గా మాజీ భార్య రీనా దత్తా గురించి మాట్లాడారు. ఆమెను తాను ఎంతగానో ప్రేమించానని అన్నారు. తాము ఎంతో ఆనందంగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అనుకోని విధంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ పరిణామాలను తాను ఏమాత్రం ఊహించలేదని అన్నారు. విడాకుల కారణంగా తాను మద్యానికి బానిసయ్యానని వెల్లడించారు. ఆ బాధ నుంచి బయటపడటానికి తనకు ఎంతో సమయం పట్టిందని వెల్లడించారు. తనను తాను 'దేవదాస్' అని పిలుచుకుంటూ, తాను సంవత్సరాలు పాటుగా ఎలా కష్టపడ్డానో ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ చెప్పారు.
రీనాతో విడిపోయిన సమయంలో నేనెంతో బాధపడ్డా. సుమారు మూడేళ్లపాటు అలానే గడిపా. వర్క్‌పై దృష్టి పెట్టలేకపోయా. దాంతో షూటింగ్స్‌కు కూడా దూరంగా ఉన్నా. స్క్రిప్ట్ వినలేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడే వాడిని. నిద్ర పట్టేది కూడా కాదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. ప్రశాంతంగా నిద్రపోవడం కోసం మద్యం తాగడం అలవాటు చేసుకున్నా. అసలు ఆల్కహాల్ గురించి ఏమీ తెలియని నేను ఉన్నట్టుండి రోజుకో బాటిల్ తాగడానికి అలవాటు పడ్డా. ఒక విధంగా చెప్పాలంటే ఏడాదిన్నరపాటు దానికి బానిసయ్యా. దేవదాస్ అయ్యా. తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యా. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఎక్కువ సమయమే పట్టింది. పరిస్థితిని అర్థం చేసుకున్నా. ఇష్టపడిన వారు పక్కన లేకుండానే జీవితాన్ని కొనసాగించాలని తెలుసుకున్నా” అని ఆమిర్ ఖాన్ చెప్పారు.
1986లో ఆమిర్ ఖాన్ - రీనాదత్తా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె ఐరా, కుమారుడు జునైద్ ఉన్నారు. 2002లో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం ఆమిర్.. కిరణ్రావును వివాహం చేసుకున్నారు. 2021లో వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఆయన గౌరీ అనే స్నేహితురాలితో రిలేషన్లో ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో వెల్లడించారు.
ఆమిర్ ఖాన్ తన కెరీర్ ప్రారంభంలోనే రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐరా, జునైద్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా 2002లో రీనా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమిర్ కిరణ్ రావును 2005లో కలిశారు. అదే సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహం కూడా 16 సంవత్సరాల తర్వాత ముగిసింది. ఆమిర్, కిరణ్ రావు 2021లో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల, ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2025లో తన 'లైట్స్, కెమెరా, ఆమిర్: త్రీ డికేడ్స్ ఆఫ్ ఎ సూపర్ స్టార్' సెషన్ సందర్భంగా, ఆమిర్ రీనాతో తన 'రన్అవే మ్యారేజ్'ను గుర్తుచేసుకున్నాడు . "ఇది ఒకరన్అవే మ్యారేజ్, హమ్నే భాగ్ కే షాదీ కి దిస్ (మేము పెళ్లి చేసుకోవడానికి పారిపోయాము)" అని ఆమిర్ పంచుకున్నాడు. ఇటీవల, తన 60వ పుట్టినరోజు సందర్భంగా, ఆమిర్ ఖాన్ తన స్నేహితురాలు గౌరీ ప్రాట్‌ను పరిచయం చేశాడు, ఆమెతో గత ఏడాదిన్నర కాలంగా డేటింగ్ చేస్తున్నాడు.