షాకింగ్.. 15 ఏళ్ల వివాహ బంధానికి అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు గుడ్‌బై

Aamir Khan and Kiran Rao announce divorce.బాలీవుడ్ లో మరో దాంపత్య జీవితం పెటాకులకు దారి తీసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2021 12:38 PM IST
షాకింగ్.. 15 ఏళ్ల వివాహ బంధానికి అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు గుడ్‌బై

బాలీవుడ్ లో మరో దాంపత్య జీవితం పెటాకులకు దారి తీసింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ విడాకులు తీసుకున్నారు. నటుడు అమీర్ ఖాన్, చిత్ర దర్శకురాలు, నిర్మాత అయిన కిరణ్ రావు వివాహబంధం 15 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌తో సహ-తల్లిదండ్రులుగా ఉంటామని తెలిపారు. అలాగే పానీ ఫౌండేషన్‌పై తమ వృత్తిపరమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. తాము విడిపోవాల‌ని కొంత కాలం క్రితమే నిర్ణ‌యం తీసుకుని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామ‌ని వివ‌రించారు. కాగా, ఆమిర్ ఖాన్ 1986లో రీనా ద‌త్త‌ను పెళ్లి చేసుకుని, 2002లో విడాకులు ఇచ్చారు. అనంత‌రం కిర‌ణ్ రావ్‌ను 2005లో పెళ్లి చేసున్నాడు. ఇప్పుడు ఆమెతోనూ విడిపోతున్నాడు. ఆయ‌న‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు

.'ఈ అందమైన 15 సంవత్సరాల్లో మేము జీవితకాల అనుభవాలు, ఆనందం, నవ్వులను పంచుకున్నామని ఇరువురూ తమ స్టేట్మెంట్ లో తెలిపారు. మా సంబంధం నమ్మకం, గౌరవం మరియు ప్రేమలో మాత్రమే పెరిగింది. ఇప్పుడు మేము మా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము. ఇకపై భార్యాభర్తలుగా కాకుండా తమ ప్రయాణం సాగనుందని ఆమిర్ ఖాన్ మరియు కిరణ్ రావు విడుదల చేసిన ప్రకటనలో ఉంది. ఆమిర్, కిరణ్ విడివిడిగా జీవించినప్పటికీ తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌ను కలిసి పెంచుతారని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ఇకపై భార్య భర్తలుగా కొనసాగలేకపోయినా కుటుంబం కోసం సహ తల్లిదండ్రులుగా బాధ్యతను తీసుకుంటామన్నారు. కొంతకాలం నుంచి విడి విడిగానే ఉంటూ వస్తున్నామని.. వేర్వేరుగా మా జీవితాలను, కుటుంబాలను విస్తరించుకోవడానికి ముందుకెళతామన్నారు. మా కొడుకు అజాద్‌ పెంపెకంలో ఇద్దరం కలిసే ఉంటామని.. మేం చేస్తున్న, చేయబోయే సినిమాలు, పానీ ఫౌండేషన్‌ వ్యవహారాల్లోనూ కలిసే' ముందుకెళతామన్నారు.


Next Story