తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్

Aadhipurush pre release event in Tirupati. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా విడుదల కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  24 May 2023 2:39 PM IST
తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా విడుదల కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాను జూన్ 16వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో, సీతారాములుగా ప్రభాస్ - కృతి సనన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్ కారణంగా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖాయం చేశారు. జూన్ 6వ తేదీన తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

అమెరికాలోని ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. సినీమార్క్ థియేటర్ చైన్ లో సినిమా టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. Cinemark లో 3D వెర్షన్ కోసం 23 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. సాధారణ స్క్రీన్‌లలో 20 డాలర్లకు టికెట్లను విక్రయిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ ఉండడంతో సినిమాను 3డీలో చూడడానికే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. U.S. ప్రీమియర్‌లు జూన్ 15, గురువారం షెడ్యూల్ చేశారు. ప్రీమియర్ షోలు భారత కాలమానం ప్రకారం ఉదయం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. టికెట్స్ సేల్స్ బాగా ఉంటే అదనపు షోలు, థియేటర్లు త్వరలో పెంచనున్నారు. దేవదత్త నాగే, సన్నీ సింగ్, ఇతర నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. టి-సిరీస్, రెట్రోఫిల్స్ బ్యానర్లపై ఆదిపురుష్ సినిమాను నిర్మించారు.


Next Story